గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత వల్లభనేని వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గమనించదగిన విషయమేమిటంటే… గన్నవరం నియోజకవర్గంలో 2019 నుండి 2024 వరకు మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ శాఖ నివేదిక ఆధారంగా ఏసీబీ పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పీటీ వారెంట్ అమలు జరుగుతుండగా, వంశీ హైకోర్టు వేకేషన్ బెంచ్‌ను ఆశ్రయించారు. కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
అయితే ప్రభుత్వానికి మట్టి అక్రమ తవ్వకాల కారణంగా రూ.195 కోట్లు నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో, అంతటి కీలక కేసులో బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
దీంతో, హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. దీనికోసం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేసి, తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపారు. సోమవారం రోజున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం.
Read More : ఆయేషా మీరా హత్య కేసు: High Court

One thought on “వల్లభనేని వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం”
Comments are closed.