న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో సంచలన మలుపు…

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక్కసారిగా ఊహించని మలుపు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన పూర్ణచందర్‌ను మద్దతు ఇస్తూ ఆయన భార్య స్వప్న తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలిగా తానే మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు కొత్త మలుపు తిప్పాయి. స్వప్న వివరణలో మాట్లాడుతూ… స్వేచ్ఛతో తన పరిచయం తన భర్త పూర్ణచందర్ ద్వారానే ఏర్పడిందని, మొదట వారి మధ్య సంబంధం ఉందని తెలియకపోయినప్పటికీ, ఆ తరువాత విషయం తెలిసిన వెంటనే తాను పూర్ణచందర్‌ను వదిలేశానని వెల్లడించారు. అయితే ఆ తర్వాత స్వేచ్ఛ తనపై తీవ్ర మానసిక వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.

తన భర్తను బ్లాక్‌మెయిల్ చేయడమే కాకుండా, తన పిల్లలకు కూడా “అమ్మా” అని పిలవాలని స్వేచ్ఛ బలవంతంగా ఒత్తిడి చేసిందని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ కుమార్తె అరణ్య తన భర్తపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం కాదని తేల్చి చెప్పారు. పూర్ణచందర్ అరణ్యను తన సొంత కూతురిలాగే చూసేవాడని తెలిపారు.

“నా భర్త నిజంగా అమాయకుడు… అసలైన బాధితుడు ఆయనే. స్వేచ్ఛే మమ్మల్ని మానసికంగా బాధించింది,” అని స్వప్న పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కేసు దర్యాప్తులో కీలక మలుపు తీసుకురావచ్చని భావిస్తున్నారు. పోలీసుల దృష్టిలోనూ ఈ ప్రకటనలు ఒక కొత్త కోణంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Read More : మహా న్యూస్ ఘటనను ఖండించిన సీఎం

One thought on “న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో సంచలన మలుపు…

Comments are closed.