ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4 ప్రాజెక్ట్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పీ4లో మార్గదర్శులుగా తానే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు హాజరయ్యారు.
Read More : విభజన హామీలపై ఎంపీలు విఫలమయ్యారా? – వైఎస్ షర్మిల ఫైర్

One thought on “కుప్పంలో 250 కుటుంబాలు దత్తత – సీఎం”
Comments are closed.