బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు పట్టు బిగిస్తున్నారు. నూతనకల్ పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సన్నీ యాదవ్ యూట్యూబ్ వీడియోల ద్వారా బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలతో నూతనకల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో, సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సన్నీ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది.
Read More : విశాఖపట్నంలో వైసీపీకి రాజకీయం విషమం – జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం దిశగా కూటమి వ్యూహం

2 thoughts on “బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్‌పై లుకౌట్ నోటీసులు”
Comments are closed.