నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన 26 సంవత్సరాల విద్యార్థిని ప్రియాంక, అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె, కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతుల కుమార్తె.
అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రియాంక ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. ఇటీవల దంత సంబంధిత సమస్యతో ఆసుపత్రిని సంప్రదించగా, ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ (రక్త కాలుష్యం) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన ప్రియాంక అక్కడ కిందపడిపోవడం గమనించిన స్నేహితులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గుర్తించిన వైద్యులు, బ్రెయిన్ డెడ్ అయిందని తేల్చారు.
ప్రియాంక మరణ వార్త ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు సంఘాలు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు సహకారం అందిస్తున్నాయి.
Read More : మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం వరంగల్, ములుగు పర్యటన.

One thought on “అమెరికాలో నల్గొండ యువతి మృతి”
Comments are closed.