విశాఖపట్నంలో వైసీపీకి రాజకీయం విషమం – జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం దిశగా కూటమి వ్యూహం

విశాఖపట్నంలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి వెంకట కుమార్‌ను పదవి నుంచి తప్పించేందుకు టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి పార్టీలు చురుకుగా వ్యవహరిస్తున్నాయి. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన మద్దతు కూడగట్టిన కూటమి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్‌కు నోటీస్ ఇవ్వనుంది.

కూటమి వ్యూహబద్ధంగా ముందుకు

ఇప్పటికే టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సంతకాలు సేకరించారు. టీడీపీ అధిష్టానం సూచనల మేరకు నగర ఎమ్మెల్యేలు, కూటమి నేతలు జీవీఎంసీ మేయర్ పదవిని దక్కించుకునేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 98 కార్పొరేటర్ స్థానాల్లో వైసీపీ బలం ఎక్కువగా ఉన్నప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలతో కూటమికి తిరుగులేని ఆధిక్యం లభించింది.

కూటమి బలం పెరుగుతోంది

జీవీఎంసీలో మొత్తం 97 కార్పొరేటర్లు ఉండగా, 29 మంది టీడీపీ తరఫున గెలిచారు. అయితే, ప్రభుత్వ మార్పు అనంతరం 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. జనసేనకు ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా, స్వతంత్ర కార్పొరేటర్లు, బీజేపీ నుంచి వచ్చిన వారితో కలిసి కూటమి శక్తిని పెంచుకున్నారు. సోమవారం మరో తొమ్మిది మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజా రాజకీయ మార్పులతో మొత్తం 109 ఓట్లకు గాను, కూటమి బలం 73కి చేరింది.

ఈ నేపథ్యంలో జీవీఎంసీ మేయర్ పదవి మార్పు దిశగా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. తాజా పరిణామాలు వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే సూచనలున్నాయి.

Read More : డీలిమిటేషన్‌ సమావేశంపై జనసేన స్పష్టత.. చెన్నై భేటీలో పాల్గొనలేదన్న ప్రకటన

One thought on “విశాఖపట్నంలో వైసీపీకి రాజకీయం విషమం – జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం దిశగా కూటమి వ్యూహం

Comments are closed.