మెట్రో కారిడార్-6 పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

court

హైదరాబాద్ మెట్రో కారిడార్-6 పనులకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన మెట్రో మార్గంలో పలు వారసత్వ కట్టడాలు ఉన్నాయని, Telangana Heritage Act ప్రకారం వాటిపై ప్రభావాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ప్రస్తుతానికి మెట్రో పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారసత్వ కట్టడాలపై పడే ప్రభావాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వానికి మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Read More : ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

One thought on “మెట్రో కారిడార్-6 పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

Comments are closed.