ఏపీలో జూలై 10న ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ కింద రెండవ విడత నిధులు ఈ నెల జూలై 10న విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించి విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనసాగిస్తోంది. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. అయితే, ఆ విడతలో నగదు అందని లబ్ధిదారులు, అలాగే ఒకటో తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో తాజాగా చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడతలో సాయం అందనుంది. ఇప్పటికే రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. నిధుల పంపిణీ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

ఈ పథకం ద్వారా విద్యార్థుల హాజరు మెరుగవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Read More : జైలు నుంచి విడుదలైన వంశీ, జగన్‌ను కలిసిన దంపతులు

One thought on “ఏపీలో జూలై 10న ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు పంపిణీ

Comments are closed.