జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు త్వరలోనే జారీ చేయనున్నట్లు రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

గురువారం (జూలై 24) ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాల్గో జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, “వచ్చే వారంలో యూనియన్ నాయకులతో చర్చించి అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటాం. కార్డులు ఇచ్చిన వెంటనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తాం” అని తెలిపారు.

ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడుతూ, “సుప్రీంకోర్టులో ఉన్న సమస్యలపై న్యాయ నిపుణులతో చర్చించి, ఎలాంటి ఆటంకం లేకుండా స్థలాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

read More : జన్మదిన శుభాకాంక్షలు పొందిన కేటీఆర్