స్పెయిన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పోర్చుగీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించిన ఫార్వర్డ్ ప్లేయర్ డియోగో జోటా (28) మరణించాడు. స్పెయిన్‌లోని జమోరా ప్రాంత సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన సోదరుడు ఆండ్రీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
జోటా ఆకస్మిక మరణంతో లివర్‌పూల్ క్లబ్, పోర్చుగల్ జాతీయ జట్టు సభ్యులు, అభిమానులు తీవ్ర దిగులులో మునిగిపోయారు. ఫుట్‌బాల్‌ను ప్రేమించే కోట్లాది మంది అభిమానులకు ఇది తీరని లోటుగా మిగిలింది. డియోగో జోటా తన ఆటలో చూపించిన సమర్థత, నైపుణ్యం, జట్టుపై చూపిన నిబద్ధతకు గుర్తుగా క్రీడా ప్రపంచం ఆయనను నివాళులర్పిస్తోంది.
Read More : టోక్యోకి వెళ్తున్న జపాన్ విమానానికి సాంకేతిక లోపం

One thought on “లివర్‌పూల్ స్టార్ డియోగో జోటా ట్రాజిక్ మరణం”
Comments are closed.