బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను హాస్యాస్పదంగా పేర్కొంటూ, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ, “ఈ లేఖను కవిత ఏ హోదాలో రాశారు? బీఆర్‌ఎస్ నేతగానా? లేక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగానా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 21 శాతానికి కుదించినప్పుడు కవిత ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.
అలాగే, 2014 నుంచి 2018 మధ్య కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం లేని పరిస్థితిలో మహిళా ఉద్యమ నాయకురాలిగా పేర్కొనే కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మహిళలపట్ల అన్యాయం జరిగినప్పుడు స్పందించని కవితకు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మహేశ్ విమర్శించారు.
Read More : రోడ్లు, భవనాల శాఖపై మంత్రి సమీక్ష

One thought on “బీసీ రిజర్వేషన్లపై కవిత లేఖ హాస్యాస్పదం”
Comments are closed.