నీతి ఆయోగ్ బృందంతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం – వికసిత్ ఏపీ 2047పై చర్చ

నీతి ఆయోగ్ బృందం సీఎం చంద్రబాబుతో భేటీ

అమరావతి, ఫిబ్రవరి 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ (NITI Aayog Vice Chairman Suman Bery) నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఈ భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకున్న నీతి ఆయోగ్ బృందాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్‌లతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ జరిపారు.

భేటీలో ప్రధాన అంశాలు

ఈ సమావేశంలో వికసిత్ ఏపీ – 2047 విజన్ డాక్యుమెంట్ పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, ఏపీలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల, నీతి ఆయోగ్ బృందం మంతనాలు జరుపనున్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నీతి ఆయోగ్ ప్రతినిధుల కీలక సమావేశం

ఈ భేటీలో ఏ. ముత్తు కుమార్ (IAS), పార్థసారథి రెడ్డి (IAS), కె. కిషోర్ వంటి నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ

  • ఏపీకి ఉన్న అప్పులు మరియు వాటి నిర్వహణపై చర్చించనున్నారు.
  • సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రాధాన్యతనిచ్చి చర్చించారు.
  • పన్నుల్లో రాష్ట్ర హక్కు, కేంద్ర ప్రయోజిత పథకాల్లో ఏపీ వాటా వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

Read More

One thought on “నీతి ఆయోగ్ బృందంతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం – వికసిత్ ఏపీ 2047పై చర్చ

Comments are closed.