అమరావతి: ఎర్రచందనం ఒక అరుదైన జాతిగా ఉండడంతో, దాని పరిరక్షణ అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎర్రచందనం సంరక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు.
195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ఏపీ అటవీ శాఖ, రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అలాగే, అక్రమ స్మగ్లింగ్‌లో నిమగ్నమైన 8 మంది నేరస్తులను పట్టుకున్న అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ఆపరేషన్ ద్వారా ఎంతో విలువైన సహజ సంపదను అధికారులు రక్షించారని అన్నారు. ఇది అధికారుల అపారమైన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో చూపిన అంకితభావం, వేగవంతమైన చర్యల కోసం అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ నేరాలను అరికట్టేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు పూర్తి మద్దతుగా నిలుస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విజయం భవిష్యత్ తరాల కోసం మన అడవులను రక్షించేందుకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.
More Information
సునీతా విలియమ్స్ భూమికి తిరిగొస్తుందా?
