ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కొణిదెల నాగబాబు (Konidela Nagababu) నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నాగబాబు అభ్యర్థిత్వానికి మద్దతుగా నేతలు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పార్టీ నేతలకు నాగబాబు ధన్యవాదాలు
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నామినేషన్‌ను బలపరిచిన నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

One thought on “ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ – లోకేష్ బలపరిచిన అభ్యర్థిత్వం”
Comments are closed.