పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ S.S. రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఓటిటిలో స్ట్రీమ్ అయ్యాక, గ్లోబల్‌గా క్రేజ్ పెరిగింది.
ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పెద్ద పాన్ ఇండియా హీరోలుగా మారారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు.
ఇక ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. FIFA గురించి తెలియని ఫుట్‌బాల్ అభిమానులు ఉండరు. అలాంటి FIFA ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ప్రముఖ ఆటగాళ్లు నెయ్మర్, టెవెజ్, రొనాల్డోలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాటు నాటు స్టెప్ స్టిల్‌తో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్ట్ చేశారు.
దీంతో ఈ పోస్ట్ నెట్టింటా తెగ వైరల్ అయింది. FIFA ఎన్టీఆర్ పేరును క్రియేటివ్‌గా జోడించి పోస్ట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీనికి తారక్ ఇచ్చిన సరదా రిప్లై కూడా వైరల్ అవుతోంది.
దీంతో మరోసారి ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆయన అభిమానులు ఆనందంతో తెగ సంబరపడుతున్నారు. “NTR తెలుగు ప్రైడ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మన టాలీవుడ్ స్థాయి ప్రపంచానికి మరోసారి తెలిసింది.
