జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

manohar

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో భారీ బహిరంగ సభ జరిగింది. ‘జయకేతనం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా జనసేన కార్యకర్తలు, అనుచరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ, జనసేన పార్టీ ఇప్పుడు ప్రశ్నించే పార్టీ నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

“పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ నిలబడ్డారు. అలాంటి వ్యక్తికి మరింత మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికి ఉపయోగపడే నాయకుడు” అని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

అంతేకాదు, గతంలో సభలకు అనుమతుల విషయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ఈసారి సభకు సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేసిన జనసేన నాయకులు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు వెచ్చించేవారని ఆయన గుర్తు చేశారు. “ఇది పవన్ కళ్యాణ్ సేవా భావానికి నిదర్శనం” అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

Read More

One thought on “జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

Comments are closed.