బైరెడ్డి శబరి ఘాటు వ్యాఖ్యలు – సిద్ధార్థ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

Siddharth Reddy

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, “ఏం అభివృద్ధి చేశారో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. సిద్ధార్థ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా?” అంటూ సవాల్ విసిరారు.

సిద్దార్థ్ రెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టించారని, కార్యకర్తలపై దాడులు చేయించారని బైరెడ్డి శబరి ఆరోపించారు. “నేను మర్చిపోను. జగన్ తల్లి, చెల్లిపై వైసీపీ చేసిన విధంగానే ఇక్కడా జరుగుతోంది” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“9 నెలలుగా సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడ ఉన్నారు?” అని ప్రశ్నించిన బైరెడ్డి శబరి, “కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు సిద్ధార్థ్ రెడ్డికి లేదు. ఫుల్ బాటిల్ వేయడం బాగా అలవాటైనట్టుంది” అంటూ ఎద్దేవా చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారని, కానీ ఆ ఆశ కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి మళ్లీ రావాలన్న భావనతో ఉందా?” అని నిలదీశారు.

“సిద్ధార్థ్ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారు” అంటూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన బైరెడ్డి శబరి, “సినిమాల్లో ట్రై చేస్తే బెటర్” అంటూ సలహా ఇచ్చారు. “ఆడుదాం ఆంధ్రాలో” అంటూ అవినీతి గురించి బయట పెడతామని హెచ్చరించారు. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భావోద్వేగానికి గురైన బైరెడ్డి శబరి

కర్నూలులో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ బైరెడ్డి శబరి ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న ఆయన, “సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాను. హత్య వెనుక ఉన్న వారిని వదలిపెట్టను. టీడీపీకి హత్యకు సంబంధం లేదు. ఇది ప్రీ ప్లాన్డ్ హత్య” అని తెలిపారు.

“పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు కత్తులు, కొడవళ్లతో బెదిరించి ఓట్లు వేయిస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి” అని బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

Read More