మళ్లీ ఢిల్లీకి సీఎం చంద్రబాబు…

chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన ఆయన, మళ్లీ మూడు రోజుల పర్యటనలో భాగంగా జాతీయ రాజధానిలో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఈ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు, ఇతర కీలక కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశాలు జరగనున్నట్టు సమాచారం.

నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు

ఈ నెల 24న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం, ఆయన ఢిల్లీ నుంచి కుప్పం నియోజకవర్గానికి వెళతారు. అక్కడ స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చిస్తారని సమాచారం.

Read More : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ “మన ఊరు – మాటా మంతి”

One thought on “మళ్లీ ఢిల్లీకి సీఎం చంద్రబాబు…

Comments are closed.