స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి

Swachh Andhra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో జరిగిన ‘స్వచ్ఛ్ దివస్’ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.

రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసిన చంద్రబాబు
చంద్రబాబు మాట్లాడుతూ, “47 ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్లాను. 41 ఏళ్లుగా అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు చేసిన కృషికి రెట్టింపు శ్రమించి రాబోయే 22 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా మార్చేందుకు కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు.

ప్రజల ప్రశ్నలకు సీఎం సమాధానాలు
ఒక మహిళ ఆరోగ్యశ్రీలో కొన్ని పరీక్షలు అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించగా, మరొకరు పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి రాకపోవడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, “ఇది ప్రజా ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి రెండు చేయాలనేదే నా అభిమతం. గతంలో టీడీపీ ప్రభుత్వం కొనసాగినట్లయితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేది” అని తెలిపారు.

స్వచ్ఛాంధ్రకు అంకితమైన సీఎం
స్వచ్ఛ దివస్‌లో సీఎం చంద్రబాబుకు మంత్రులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, డిస్పోజబుల్ వస్తువుల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం స్వచ్ఛాంధ్రపై విద్యార్థినుల గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్రంలో ఉత్తమ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సీఎం సత్కరించి మెమెంటోలు బహుకరించారు.

ఏపీకి ఆశాజ్యోతి చంద్రబాబు:
తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఆశాజ్యోతి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తుందని” ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More

One thought on “స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి

Comments are closed.