రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజిని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, ఎమ్మెల్యే చంద్రశేఖర్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్చగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాం. టీడీపీ నేత చంద్రబాబు ప్రభుత్వ అధికారులను వైఎస్సార్సీపీ మద్దతుదారులకు మేలు చేయవద్దని చెప్పడం దారుణం. లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారికి మేలు చేయాలి. కానీ చంద్రబాబు ఈ హక్కును అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనకు దారితీస్తోంది” అని వ్యాఖ్యానించారు.
“ప్రస్తుతం కేబినెట్ మొత్తం వివక్షతో వ్యవహరిస్తోంది. సామాన్య ప్రజలను రాజకీయాలకు ఇరికించడం సరికాదు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం” అని బొత్స స్పష్టం చేశారు.

One thought on “గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు”
Comments are closed.