చంద్రబాబు కుట్రలో భాగం అని మండిపడ్డ రోజా

వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహంతో స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. సొంత అన్నపై పెంచుకున్న అసూయ, ద్వేషంతోనే ఆమె ఈ మేరకు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

షర్మిల ఆస్త్రం, చంద్రబాబు కుట్ర
షర్మిల రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు రూపొందించిన కుట్రలో ఒక అస్త్రంగా మారినట్లు రోజా తెలిపారు. నిర్దోషులపై బురదచల్లేలా, తప్పుడు ఆరోపణలు చేసేలా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి బెయిలు వచ్చేలా చేసి, టీవీల్లో వారిని హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు.

వివేకా హత్య–టీడీపీ హయాంలోనే
వివేకా హత్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, అప్పట్లోనే కేసును సీబీఐకి అప్పగించాలని, విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని సూచించారని తెలిపారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా తమపై వేలెత్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యమా?
సొంత అన్న జగన్‌ను ఇబ్బంది పెట్టడమే షర్మిల లక్ష్యమని రోజా ప్రశ్నించారు. నిర్దోషులను బలిపశువులుగా మార్చే ప్రయత్నం శోచనీయం అని వ్యాఖ్యానించారు.

Read More : ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన..