అనతికాలంలోనే జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాశారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పెను మార్పులు తీసుకువచ్చారు. చాణిక్య నీతిని అనుసరించి రికార్డు సృష్టించారు.
తిరుగులేని శక్తిగా జనసేన ప్రస్థానం
అమరావతి: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు ఒక చరిత్ర. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వైసీపీ నేతలు ఎంత విమర్శించినా, తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు సాగారు. 2014 మార్చి 14న హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన సభలో జనసేన పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించి, అప్పటి నుంచి పార్టీని తిరుగులేని శక్తిగా మలిచారు. 2014 నుంచి 2025 వరకు అనేక మలుపులు చవి చూసిన జనసేన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిచింది.
వెనక్కు తగ్గని పవన్..
2019లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినా పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గలేదు. తన ఓటమి కారణాలను విశ్లేషించి 2024 ఎన్నికల్లో తప్పిదాలు చేయకుండా పక్కా వ్యూహాన్ని రూపొందించారు. ఎన్టీఏ కూటమితో పొత్తు పెట్టుకుని విజయపథంలో నడిచారు. వైసీపీ అధినేత జగన్‌ను ఎదుర్కొనే విధంగా వారాహి యాత్ర చేపట్టి ప్రజల్లో విశేష ఆదరణ పొందారు. ప్రజల స్పందనను చూసి పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించి, రాజమండ్రి జైలులో ఆయన్ను పరామర్శించేందుకు బయలుదేరారు. పోలీసుల అడ్డంకులను తట్టుకొని నిరసన తెలిపి, టీడీపీతో పొత్తును ప్రకటించారు. బీజేపీని పొత్తులో భాగస్వామ్యం చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు.
పొత్తులో పవన్ కీలక పాత్ర..
పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రతి బహిరంగ సభలోనూ ‘హలో ఏపీ.. బైబై జగన్’ నినాదాలతో దూసుకుపోయారు. 2024 ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించగా, పవన్ కళ్యాణ్ తన రాజకీయ చాణిక్యతను మరోసారి చాటిచెప్పారు.

One thought on “రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ప్రస్థానం”
Comments are closed.