తెలంగాణ రైజింగ్‌కు మద్దతుగా సహకరించాలని జైశంకర్‌ను కోరిన సీఎం రేవంత్

Revanthreddy

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్, జైశంకర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

తెలంగాణను గ్లోబల్ స్థాయిలో మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో త్వరలోనే మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్ సంబంధిత కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల విజయవంతంగా నిర్వహణ కోసం కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి, ఈవెంట్లకు సంబంధించిన దౌత్య సంబంధ ఏర్పాట్లు, లాజిస్టిక్ సపోర్ట్ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం విభాగాలు చురుకుగా సహాయపడాలని కోరారు.

తెలంగాణ రైజింగ్ ద్వారా రాష్ట్రంలోని వాణిజ్య, ఐటీ, వినోద రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటాలని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత కీలకమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈవెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణ ప్రత్యేకతను వెల్లడించేలా సహకరించాలని సీఎం రేవంత్ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Read More

One thought on “తెలంగాణ రైజింగ్‌కు మద్దతుగా సహకరించాలని జైశంకర్‌ను కోరిన సీఎం రేవంత్

Comments are closed.