గుంటూరు జిల్లా జైలు వద్ద వైఎస్సార్సీపీ నేతలు భారీగా హల్చల్ చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళీని కలిసేందుకు వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సహా అనేక మంది పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఓ యువకుడు కూడా జైలు వద్దకు వచ్చి అంబటి రాంబాబును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
అంబటి రాంబాబును నిలదీసిన యువకుడు, “వైఎస్సార్సీపీ హయాంలో కాపు కులస్థులకు ఏమి చేశావు?” అంటూ ప్రశ్నించాడు. యువకుడి ప్రశ్నలకు అంబటి సమాధానాలు ఇవ్వకుండానే ములాఖత్‌కు వెళ్లిపోయారు. అయితే యువకుడు కూడా జైలు లోపలికి వెళ్లాడు. ఈ ఘటనతో వైఎస్సార్సీపీ అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు.
అంబటి రాంబాబును ప్రశ్నించిన యువకుడిపై దాడి చేసేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు జైలు వద్ద భారీగా మోహరించి, ఘర్షణ జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

One thought on “గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత..”
Comments are closed.