తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన కమిటీలో మొత్తం 27 మందిని టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, మరో 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ స్థాయిలో కార్యకర్తలకు మరింత సమర్థవంతమైన నాయకత్వం అందించేందుకు ఈ సమీకరణలు కీలకంగా మారనున్నాయని నేతలు భావిస్తున్నారు.




Read More : ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు… మరో యువకుడి ప్రాణం తీసింది.

One thought on “టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ.”
Comments are closed.