హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌన మద్దతు

harish rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మౌన మద్దతుగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

హరీష్ రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌కు చంద్రబాబును పిలిపించుకుని ఆయన పాదపూజ చేసుకున్నాడు. అందుకే చంద్రబాబు అక్రమంగా కృష్ణా నదీ నీటిని తీసుకెళ్లినా, రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదు. ఈ మౌనం ప్రజల ప్రాథమిక హక్కులను హరించడమే” అని విమర్శించారు.

ఉత్తమ్ చంద్రబాబును కలసి చాపల పులుసు తిని వచ్చాడు?

కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చంద్రబాబును విజయవాడలో కలుసుకుని చాపల పులుసు తిని వచ్చారని, అందువల్లే ఆయన కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఆరోపించారు.

పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు

హరీష్ రావు ప్రకటన ప్రకారం, ఈ ఇద్దరి నేతల మౌనం వల్లే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రైతులు నష్టపోతున్నారని, పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. “తెలంగాణ రైతుల హక్కులను కాపాడటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టంగా కనిపిస్తోంది” అని హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ జలాల విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని, తక్షణమే కృష్ణా నదీ జలాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Read More

One thought on “హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌన మద్దతు

Comments are closed.