వైసీపీ మాజీ మంత్రులపై కేసు విచారణ..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనిలపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, విచారణ కోసం ఈరోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసు నేపథ్యం ఏంటంటే… ఇటీవల పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల్లో వీరిద్దరూ పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో పోలీసులు ఈ రోజు విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక వైసీపీలో పలువురు నేతలు వరుస కేసుల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ మద్యం కుంభకోణంపై విచారణ కొనసాగుతుండగా, సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరును కూడా పలుమార్లు ప్రస్తావించారు.

దీంతో, విచారణలో రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక విషయాలు వెలుగు చూస్తాయోననే ఉత్కంఠ వైసీపీ వర్గాల్లోతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ నెలకొంది.

Read More : టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జగన్ తీవ్ర ప్రతిస్పందన

One thought on “వైసీపీ మాజీ మంత్రులపై కేసు విచారణ..

Comments are closed.