రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం, డొక్కా సీతమ్మ మాత, ఆదికవి నన్నయ లాంటి మహనీయులు” అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ. 430 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్టు తెలిపారు.
పర్యాటకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు
పర్యాటక రంగం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ముందుకు వెళ్లుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వేగంగా అభివృద్ధి జరుగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి షెకావత్ కీలకంగా వ్యవహరించారని, పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన సహకారం అపూర్వమని ప్రశంసించారు.
పర్యాటక హబ్‌గా గోదావరి తీరం అభివృద్ధి
ఏపీలోని 974 కిలోమీటర్ల నదీ తీరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. 2035 నాటికి రాష్ట్రం అంతటా పర్యాటక రంగాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
హేవలాక్ వంతెన టూరిజం స్పాట్‌గా మారనుంది
గోదావరిపై 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే, రాజమండ్రి రూరల్‌లోని బొమ్మూరులో రూ. 15 కోట్లతో సైన్స్ మ్యూజియం నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. దివాన్ చెరువులో రూ. 30 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నారు.
భద్రతా ఏర్పాట్లు పక్కాగా
ఈ భారీ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర నాయకులు హాజరవుతుండటంతో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కర్ ఘాట్ వద్ద గజఈతగాళ్లు, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. ప్లాస్టిక్ రహితంగా కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Read More : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

One thought on “అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన : DCM”
Comments are closed.