వైసీపీ అసత్య ప్రచారాలకు కూటమి కౌంటర్: రాజకీయ కుట్రలకు చెక్!

కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు: అసత్య ప్రచారాలకు చెక్‌!

ఏపీలో కూటమి పార్టీల మధ్య విభేధాలు పెంచేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందా? నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయనే అసత్య ప్రచారాలను విస్తృతం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా? ప్రస్తుత రాజకీయ పరిస్థులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల పరాజయంతో ప్రజలు వైసీపీకి దూరమవుతున్నారని అర్థమైనట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో తాము తీసుకున్న నిర్ణయాలే సరిగ్గా ఉన్నాయనే ధీమాలో మునిగిన వైసీపీ నేతలు, తమ తప్పులను సరిదిద్దుకోకపోవడంతో ఓటమి పాలయ్యారని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో, కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో వైసీపీ ముందుకు వెళ్లడం గమనార్హం.

కూటమి పార్టీల సమన్వయంపై వైసీపీ అసత్యాలు

ప్రభుత్వంలో ఎవరికీ పదవి ఇవ్వాలి, మంత్రివర్గంలో ఎవరుండాలి, ఏ శాఖలు ఎవరికీ కేటాయించాలనే అంశాలు పూర్తిగా కూటమి ప్రభుత్వ అంతర్గత విషయాలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందా అనేది ముఖ్యమైంది. కానీ వైసీపీ, కూటమి పార్టీల మధ్య విభేధాలు ఉన్నాయనే భావనను ప్రజల్లో కలిగించేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

డిప్యూటీ సీఎం అంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనపై పార్టీ శ్రేణుల మధ్య చర్చ జరుగుతోంది. కొంతమంది నేతలు ఈ డిమాండ్‌కు మద్దతు ప్రకటించగా, టీడీపీ అధిష్టానం మాత్రం ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక జనసేన కూడా డిప్యూటీ సీఎం వంటి అంశాలపై ఏ వ్యాఖ్యలు చేయవద్దని తమ శ్రేణులకు సూచించింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల స్పష్టమైన ఆదేశాలతో వైసీపీ అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట పడింది.

ఈ వార్త కూడా చదవండి

One thought on “వైసీపీ అసత్య ప్రచారాలకు కూటమి కౌంటర్: రాజకీయ కుట్రలకు చెక్!

Comments are closed.