రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు నైతికత లేదు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాం. నవరత్నాల పథకంలో 90 శాతం నిధులను మహిళల కోసం కేటాయించాం. దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు రక్షణ కల్పించేందుకు ముందు నిలిచారు” అని శ్యామల పేర్కొన్నారు.
అయితే, నేషనల్ లెవెల్‌లో 19 అవార్డులు గెలుచుకున్న దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా, ప్రస్తుతం హోంమంత్రి అనిత దిశ ప్రతులను తగలబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
అలాగే, కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,890 కేసులు నమోదయ్యాయని, ఇది రాష్ట్రంలో మహిళా భద్రత దెబ్బతిన్నదనడానికి నిదర్శనమని శ్యామల తెలిపారు. “ఒక అన్నగా, ఒక తండ్రిగా వైఎస్ జగన్ మహిళల భద్రత కోసం కృషి చేశారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది” అని ఆమె వ్యాఖ్యానించారు.

One thought on “ఏపీలో మహిళలకు భద్రత లేదు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల”
Comments are closed.