ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు అమలుకానున్నాయి. మొత్తం రూ.21,616 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇందులో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ.10,118 కోట్లతో టెండర్లు ఆహ్వానించనున్నారు. ప్రాథమిక దశలో ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
Read More : కేటీఆర్కు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

2 thoughts on “విశాఖ, విజయవాడల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు”
Comments are closed.