ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం సూపర్ హిట్ అయిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, మహిళలు ఈ పథకంపై అపార సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, “స్త్రీ శక్తి పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. వ్యాపారం చేసేవారికి, చిన్న ఉద్యోగులకు నెలకు 2 నుంచి 3 వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకూ ఈ సౌకర్యం కల్పించాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్ని సార్లయినా ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులో ఉంది” అని వెల్లడించారు.
అయితే ఈ పథకం విజయాన్ని చూసి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వారి పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తూ అనవసర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “జగన్‌కు మహిళల పట్ల గౌరవం లేదు. సీఎంగా ఉన్నప్పటికీ జాతీయ పండుగ రోజు జెండా ఎగరవేయలేకపోయారు. తమ తల్లిని, చెల్లిని కోర్టు మెట్లెక్కించారు. ఇలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు ఒప్పుకోరని” అన్నారు.
మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై కూడా మంత్రి సంధ్యారాణి స్పందించారు. “మహిళల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదు. రోజా ఇప్పటికైనా జబర్దస్త్ స్టైల్ వ్యాఖ్యలను మానుకోవాలి” అని సూచించారు.
ఇక తిరుమల కొండపై ఫ్రీ బస్ సౌకర్యం ఎందుకు కల్పించలేదనే ప్రశ్నపై మంత్రి స్పష్టతనిచ్చారు. “ఘాట్ రోడ్లపై బస్సులు సిటీ పరిమితిలోనే నడుస్తాయి. అక్కడ ఫ్రీ సదుపాయం ఇస్తే నిలబడే ప్రయాణికులు పెరుగుతారు… ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే కొండపై ఉచిత బస్సులు లేవు. అయితే 60–70 శాతం డోలి మోతలు తగ్గించాం. ఈ ఏడాది రోడ్ల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాం. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాలను రోడ్లతో కలుపుతాం. గత ప్రభుత్వ హయంలో ఒక్క రోడ్డు వేయలేదు, గుంతలు పూడ్చలేదు. అందుకే మేము రెండింతలు కృషి చేస్తున్నాం” అని వివరించారు.
Read More : నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌తో భేటీ

One thought on “స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ – రోజుకు 25 లక్షల మహిళలు లాభం”
Comments are closed.