భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ?

భారత్–బ్రిటన్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో భారత్–బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం దాదాపు 34 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీ యూకేలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. అనంతరం జూలై 25, 26 తేదీల్లో మాల్దీవులకు వెళ్లనున్నారు.

Read More : టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక