పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు తెగబడ్డది. పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను దేశంలోకి పంపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పాక్ పంపిన ఆరు డ్రోన్లను బీఎస్ఎఫ్ అప్రమత్తంగా వ్యవహరించి కూల్చివేసింది.
ఈ ఘటనలో మూడు తుపాకులు, మూడు మ్యాగజీన్లు, సుమారు 1.07 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. బుధవారం రాత్రి మోథే సమీపంలో ఐదు డ్రోన్లను కూల్చివేసిన బీఎస్ఎఫ్, గురువారం తెల్లవారుజామున అట్టారీ దాల్ గ్రామం దగ్గర మరో డ్రోన్‌ను కూల్చివేసింది.
డ్రోన్లతో పాటు పంట పొలాల్లో తుపాకీ విడిభాగాలు, మ్యాగజీన్‌ను కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పాక్ నుంచి వస్తున్న అక్రమ రవాణాపై బీఎస్ఎఫ్ మరింత అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.
Read More : ఉప రాష్ట్రపతి నివాసాన్నిసీజ్ చేసారంటూ ప్రచారం… కేంద్రం క్లారిటీ
