వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లాయర్లు లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఇవాళ (జులై 24) ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్‌రెడ్డి ఏ4 నిందితుడిగా ఉండగా, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు – ధనుంజయ రెడ్డి (ఏ31), కృష్ణ మోహన్‌రెడ్డి (ఏ32), బాలాజీ గోవిందప్ప (ఏ33) కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశిస్తూ, విచారణను జులై 29కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. మరోవైపు, మద్యం ముడుపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈడీ జులై 28 ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
జగన్ సీఎంగా ఉన్న కాలంలో ‘ఆంధ్రా గోల్డ్’ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారీ జరిగిందని, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే సిట్ ప్రిలిమినరీ చార్జిషీట్ దాఖలు చేయగా, ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించాలని తుది నిర్ణయం తీసుకుంది.
Read More : విశాఖ, విజయవాడల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు

One thought on “లిక్కర్ స్కాం: మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్, ఈడీ దర్యాప్తు”
Comments are closed.