తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్. గతేడాది ఫిబ్రవరిలో తొలి బడ్జెట్‌లోనే వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం, ఈసారి మరింత ఎక్కువగా రైతులకు మేలు జరిగేలా పథకాలను రూపొందించింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ముఖ్య కేటాయింపులు:
- రైతు భరోసా: ఎకరానికి రూ.12,000 కేటాయించారు. మొత్తం రూ.18,000 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- వ్యవసాయ రంగానికి: రూ.24,439 కోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో రైతు కూలీల సంక్షేమానికి రూ.12,000
- సన్నవడ్లకు రూ.500 బోనస్
- ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలు
- 14,236 అంగన్‌వాడీల పోస్టుల భర్తీ
- గృహజ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు
- ప్రతి నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ల నిర్మాణం
- హైదరాబాద్ పరిసరాల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు
- రూ.2 లక్షలలోపు రైతు రుణాలు మాఫీ
- 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు మాఫీ
ఇతర రంగాలకు ముఖ్యమైన కేటాయింపులు:
- క్రీడలకు: రూ.465 కోట్లు
- అడవులు – పర్యావరణానికి: రూ.1023 కోట్లు
- దేవదాయ శాఖకు: రూ.190 కోట్లు
- హోంశాఖకు: రూ.10,188 కోట్లు
- చేనేతకు: రూ.371 కోట్లు
- మైనారిటీ సంక్షేమానికి: రూ.3591 కోట్లు
- పరిశ్రమల శాఖకు: రూ.3527 కోట్లు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు: రూ.774 కోట్లు
- విద్యుత్ శాఖకు: రూ.21,221 కోట్లు
- వైద్యం, ఆరోగ్యానికి: రూ.12,393 కోట్లు
- మున్సిపల్ – పట్టణాభివృద్ధికి: రూ.17,677 కోట్లు
- నీటి పారుదల శాఖకు: రూ.23,373 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు: రూ.5907 కోట్లు
- పర్యాటక శాఖకు: రూ.775 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి: రూ.40,232 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి: రూ.17,169 కోట్లు
- బీసీ సంక్షేమానికి: రూ.11,405 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి: రూ.31,605 కోట్లు
- మహిళా శిశుసంక్షేమానికి: రూ.2862 కోట్లు
- పశుసంవర్థక శాఖకు: రూ.1674 కోట్లు
- పౌర సరఫరాల శాఖకు: రూ.5734 కోట్లు
- విద్యాశాఖకు: రూ.23,108 కోట్లు
రైతులు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ పలు రంగాల్లో అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవనుందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

One thought on “రైతు భరోసా సహా పలు రంగాలకు భారీ కేటాయింపులు”
Comments are closed.