వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్

KCR

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక సూచనలు అందించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల నేతలతో కేసీఆర్ స్వయంగా టెలిఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల పక్కన నిలిచి, తక్షణ సహాయం అందించేందుకు పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగాలని ఆయన కేటీఆర్‌కు సూచించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో వరదల కారణంగా రహదారులు తెగిపోవడం, రవాణా అంతరాయం, ఇళ్లు నీట మునగడం, పంటలు నాశనం కావడం వంటి పరిస్థితులపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, ప్రాజెక్టుల నుంచి నీరు పోటెత్తడంతో వందల ఎకరాల్లో పంటలు మట్టిపాలు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలను వేగవంతం చేస్తున్నారు.

Read More : Minister – వరద రక్షణ చర్యలకు హెలికాప్టర్ల ఏర్పాట్లు

One thought on “వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్

Comments are closed.