పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. గతంలో నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని చేసిన వ్యాఖ్యల తర్వాత తాజాగా ఆయన టీడీపీ పగ్గాలు లోకేశ్‌కు అప్పగించాలని కోరారు.
కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన వర్మ, “పార్టీకి లోకేశ్ నాయకత్వం అత్యంత అవసరం. యువగళం పాదయాత్రతో లోకేశ్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. పార్టీ విజయానికి అది ఉపయోగపడింది” అని వ్యాఖ్యానించారు.
అలాగే టీడీపీ భవిష్యత్ కోసం 2047 వరకూ దృష్టి పెట్టే ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తల మద్దతు అవసరమని పిలుపునిచ్చారు. ప్రస్తుతం లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా, చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read More : 85 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన పంచాయతీ కార్యదర్శి..

One thought on “పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు”
Comments are closed.