చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ పరిరక్షణ చట్టాల కింద కూడా కేసులు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ, బుగ్గ మఠానికి చెందిన భూములను ఆక్రమించారన్న తీవ్ర ఆరోపణలు తలెత్తాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ పవన్ కల్యాణ్ కు సమగ్ర నివేదికను సమర్పించారు.
భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అటవీ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వ అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫార్సు చేయబడింది.
ఈ నివేదికను పరిశీలించిన తరువాత, పవన్ కల్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై, అటవీ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అటవీ భూములను ఆక్రమించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి కుటుంబం, వారికి సహకరించిన అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read More : టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిపై ప్రధాన ఆరోపణలు

One thought on “చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ ఆదేశాలు.”
Comments are closed.