పంచాయతీ కార్యదర్శి పదవిలో ఉండి కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. చంద్రగిరి పంచాయతీలో EOగా పని చేసిన మహేశ్వరయ్యకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇటీవల భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు.
గతంలో, 2024 ఫిబ్రవరిలో లంచం తీసుకుంటూ రూ.50 వేలతో పట్టుబడిన మహేశ్వరయ్య – తాజాగా తిరుపతి జిల్లా పేరూరులోని అతడి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్మెంట్, పలమనేరులో మూడు అంతస్తుల భవనం, ఫాం హౌస్, బద్వేలు పరిసరాల్లో విస్తారమైన భూములు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఆస్తుల విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాధారణ పంచాయతీ ఉద్యోగిగా ఇలా అక్రమంగా సంపద సేకరించడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

Read More : మెగా DSC కి శుభారంభం – త్వరలో నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలు

One thought on “85 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన పంచాయతీ కార్యదర్శి..”
Comments are closed.