మహానాడు పేరిట కడపలో టీడీపీ నేతలు పెట్టిన సభను ఆయన ఘాటుగా తప్పుపట్టారు. “సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు… ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్లే అసలైన సత్తా తెలిసిపోతుంది. కడపలో సభ పెట్టి జగన్‌ను తిట్టడం వల్ల అది తపించి పోతుందా?” అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.
మహానాడు జరుగుతున్న కడపలో గడపగడపకూ టీడీపీ నాయకులను పంపే ధైర్యం ఉందా? అని జగన్ ప్రశ్నించారు. “మా కడప మహిళలు ఎదురు చూస్తున్నారు… ఉచిత బస్సు ఇస్తే విశాఖ వరకు వెళ్లిరావచ్చు కదా… దానికి అతి గతి లేదు” అని కూడా ఎద్దేవా చేశారు.
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది – జగన్
వైఎస్ జగన్ రాష్ట్రంలో జరిగే అరెస్ట్‌లు, కేసులు అన్నీ దొంగదెబ్బలేనని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గ్రూప్ రాజకీయాల కారణంగా ఒకరు మరణించగా, పిన్నెలిపై కేసు పెట్టారని చెప్పారు. నెల్లూరులో జరగని మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణిని అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు, 2023లో జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడిని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆర్కేపై ఏ127 సెక్షన్ కింద కేసు పెట్టారని అన్నారు.
“ రిటర్న్ గిఫ్ట్ వడ్డీతో ఇస్తా”
మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి రిటర్న్ గిఫ్ట్ వడ్డీతో ఇచ్చేస్తానని వైఎస్ జగన్ హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్న తప్పులను ప్రజల ముందుకు తీసుకెళ్లి తగిన తీర్పు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Read More : ఎన్టీఆర్ 102వ జయంతి: పవన్ కళ్యాణ్ ఘన నివాళులు.

One thought on “మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.”
Comments are closed.