నాచారం POCSO కేసులో 64 ఏళ్ల నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన కేసులో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మనవరాలి వయస్సున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన 64 ఏళ్ల బచ్చన్ ప్రసాద్ షాకు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.

బచ్చన్ ప్రసాద్ షా ఓ ప్రైవేట్ ఉద్యోగి. బాధిత బాలిక తన పొరుగింట్లో నివసిస్తూ ఉండగా, నిందితుడు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నాచారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్‌ జిల్లా పోక్సో కోర్టులో విచారణ జరిగింది.

తదుపరి విచారణలో న్యాయస్థానం నిందితుడిపై 20 ఏళ్ల శిక్షతో పాటు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. సంఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించిన కోర్టు, మైనర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేసింది.

Read More : ఆక్సిజన్ ప్లాంట్ వద్ద మద్యం సేవించిన వార్డ్ బాయ్ పట్టుబాటు..

One thought on “నాచారం POCSO కేసులో 64 ఏళ్ల నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Comments are closed.