సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు బొల్లారం రైల్వే స్టేషన్‌లో రైలు ప్రమాదంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. రైలు పట్టాలు తప్పడం, రెండు రైళ్ల ఢీకొనడం వంటి ఘటనల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 22 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 24 మంది స్కౌట్ అండ్ గైడ్స్ సభ్యులు, 50 మంది ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, మెడికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సిబ్బంది, యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ బృందం, ఆర్పీఎఫ్ పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
మాక్ డ్రిల్‌లో రైలు ప్రమాద సమయంలో:
- ప్రయాణికులను రైలు కిటికీలు కట్ చేసి బయటకు తీసే విధానం
- రైలు టాప్‌లో హోల్ చేసి లోపలికి వెళ్లి బాధితులను బయటకు తీసే ప్రక్రియ
- బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలు
- మంటలు ఆర్పే విధానం
- గాయపడిన వారి వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించటం లాంటి అంశాలు ప్రాక్టికల్‌గా చేసి చూపించారు.
ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు రైలు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై స్పష్టత కల్పించారు.
