సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా హెచ్‌ఎండీఏ (HMDA) కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనుల్లో భాగంగా 9,194 చెట్లు ప్రభావితమవుతుండగా, వీటిలో ట్రాన్స్‌లొకేషన్‌కు అనువుగా ఉన్న 4,230 చెట్లను వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ కోసం రూ.7కోట్లు ఖర్చు చేయనున్నారు.
ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ
ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన చెట్ల కొమ్మలను తొలగించి ప్రత్యేక యంత్రాల ద్వారా చెట్లను వేర్లతో సహా భూమిని పెకలించి వాహనంలో ఎక్కించి మరో ప్రాంతానికి తరలిస్తారు. వేర్లకు ప్రత్యేక రసాయనాలు పూసి చెట్లు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ట్రాన్స్‌లొకేషన్‌కు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడం, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో ట్రాన్స్‌లొకేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ట్రాన్స్‌లొకేషన్‌కు అనువుగా లేని చెట్లు
అలాగే, ట్రాన్స్‌లొకేషన్‌కు అనువుగా లేని మరో 2,314 చెట్లను పూర్తిగా తొలగించనున్నారు. డబుల్ డెక్కర్ ప్లైఓవర్ నిర్మాణం మరియు రోడ్ల విస్తరణకు ఇబ్బంది కలిగించని 2,314 చెట్లను కొంత వరకు కొమ్మలు తొలగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు
మొత్తం 9,194 చెట్లలో, హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు 8,357 చెట్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి కొంపల్లి అవతల ఉన్న డైరీ ఫామ్ రోడ్ వరకు మరో 837 చెట్లు ఉన్నాయి.
హెచ్‌ఎండీఏ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

One thought on “సికింద్రాబాద్‌లో చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం”
Comments are closed.