సికింద్రాబాద్: పెళ్లి నిశ్చితార్థం రద్దైన కారణంగా మనోవేదనకు గురైన ఓ యువ వైద్యుడు (Doctor) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉదయం సికింద్రాబాద్ (Secunderabad)లో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకుని (Railway Tracks) బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే…
గుజరాత్‌కు చెందిన ప్రకాష్ మాల్ కుటుంబం సికింద్రాబాద్‌లో స్థిరపడ్డారు. వారి చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ (Purohit Kishore) ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా (Doctor) పనిచేస్తున్నాడు. ఇటీవల పురోహిత్ వివాహం (Marriage) నిశ్చయమై, కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని (Engagement) ఘనంగా నిర్వహించారు.
అయితే, పురోహిత్‌కు బట్టతల (Baldness) ఉండటం, ఇతర కారణాలతో వధువు కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు కొత్త సంబంధాల కోసం చూస్తున్నా, సరైన వివాహం జరగడం లేదు. ఇప్పటికే 34 ఏళ్లు వచ్చినా పెళ్లి రద్దు కావడంతో పురోహిత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బొల్లారం రైల్వే స్టేషన్ (Bollaram Railway Station) సమీపంలోని క్యావలరీ బ్యారక్స్ (Cavalry Barracks) వద్ద రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ (Loco Pilot) ఈ విషయాన్ని గుర్తించి జీఆర్పీ (GRP) పోలీసులకు సమాచారం అందించాడు. గుర్తింపు కార్డులోని చిరునామా ఆధారంగా పురోహిత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Read More : కేంద్ర ప్రభుత్వం భారీ డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు – వేలాది *WhatsApp*, *Skype* అకౌంట్లు బ్లాక్

One thought on “సికింద్రాబాద్‌లో యువ వైద్యుడి ఆత్మహత్య – పెళ్లి రద్దవడంతో మనస్తాపం”
Comments are closed.