పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ తరఫున బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరఫున తుమ్మల హేమంత్ రెడ్డి బరిలోకి దిగారు. ఇరుపక్షాల కీలక నేతలు పులివెందులలో మకాం వేసి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు ప్రత్యేక సూచనలు చేశారు. పులివెందుల జడ్పీటీసీని గెలుచుకోవడంలో అందరూ ఒకే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా 40 మంది కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలు అందించి పంటలను కాపాడామని గుర్తుచేశారు. ఈసారి జడ్పీటీసీని గెలిచి, జగన్ చేయని విధంగా పులివెందుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు.
Read More : విశాఖ సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో కొత్త అరెస్టులు

One thought on “పులివెందుల జడ్పీటీసీ విజయంపై సీఎం కీలక సూచనలు”
Comments are closed.