మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో జైలు సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీతో భేటీ కావడానికి ఆయన సతీమణి పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ భారత్ రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు.
అయితే, వంశీతో ములాఖాత్ కోసం వచ్చినవారిని జైలు అధికారులు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం తమను అనుమతించాలని కోరినా జైలు సిబ్బంది సహకరించలేదని వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమయం ముగుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో, చివరికి అరగంట తరువాత వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.

One thought on “జైలు సిబ్బందిపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం”
Comments are closed.