హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట

bandi sanjay high court

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ కార్యకర్తల సమావేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ, సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం మార్కెట్ పీఎస్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యుల వాంగ్మూలాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు, సంఘటన జరిగి మూడు రోజుల తర్వాత ఫిర్యాదు నమోదైందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ విషయాలన్నింటిని పరిశీలించిన హైకోర్టు, బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Read More