తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు:
విచారణకు ముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అందరి కంటే ముందు బయటపెట్టింది నేనే. నా ఫోనే ఎక్కువసార్లు ట్యాప్ చేశారు. కేవలం నాదే కాదు, నా కుటుంబ సభ్యులు, సిబ్బంది, అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు” అని చెప్పారు. ఈ కేసులో తనకు ఉన్న సమాచారాన్ని అధికారులకు అందిస్తానని తెలిపారు. అయితే, ఈ ప్రభుత్వం, సిట్‌పై తనకు నమ్మకం లేదని, సిట్ అధికారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇంకా, కేసీఆర్ కుటుంబంలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
విచారణ ముమ్మరం
బండి సంజయ్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది పసునూరు మధు, బోయినిపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతిలను కూడా సిట్ పోలీసులు వేర్వేరుగా విచారించారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ విచారణ మరికొద్దిసేపట్లో ముగియనుంది. ఈ విచారణలో బండి సంజయ్ కొన్ని కీలక ఆధారాలను సమర్పించినట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

One thought on “ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్(updates)”
Comments are closed.