నటుడు పోసాని మురళీకృష్ణ (Posani Krishna Murali)కు ఊహించని షాక్ తగిలింది. జనసేన కార్యకర్తల ఫిర్యాదుతో పోసాని మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలపై జనసేన కార్యకర్తలు గత నవంబరులో ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోసాని పై కేసు నమోదు కాగా, వారం రోజుల క్రితం పిటి వారెంట్ ఆధారంగా అతడిని అరెస్టు చేసి కర్నూలుకు తరలించారు.
కోర్టులో హాజరు పరచగా జడ్జి పోసానిని రిమాండ్‌కు ఆదేశించారు. ఈ సందర్భంగా పోసాని తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా పోసాని కన్నీరు పెట్టుకుని తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. రెండు ఆపరేషన్లు, స్టంట్‌లు వేశారని, ఆరోగ్య కారణాలతో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆయన వాపోయారు.
అయితే కోర్టు పోసాని తరఫున వాదనలు వినిపించిన అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కానీ తాజాగా ఊహించని పరిణామంగా పోసాని మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

One thought on “పోసాని మురళీకృష్ణకు ఊహించని షాక్.. మళ్లీ జైలుకు”
Comments are closed.